చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో విద్యుత్ సంస్థకు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. అధిక వర్షాల కారణంగా చిత్తూరు అర్బన్ డివిజన్లో 15 స్తంభాలు, 8 నియంత్రికలు, చిత్తూరు రూరల్ డివిజన్లో 6, పుంగనూరు డివిజన్లో 10 స్తంభాలు, నాలుగు నియంత్రికలు దెబ్బతిన్నాయన్నారు.