NZB: YONEX సన్రైజ్ BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2025 పోటీలకు లైన్ జడ్జిగా జిల్లాకు చెందిన బల్ల వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ నెల 6 నుంచి 19 వరకు అస్సాంలోని గౌహతిలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు.