కోనసీమ: ప్యాప్టో ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మంగళవారం జరిగే రాష్ట్రస్థాయి ధర్నాకు మామిడికుదురు మండలం నుంచి ఉపాధ్యాయులు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని, విద్యాశాఖలోని అసంబద్ధతను తొలగించాలని, ఇంకా పలు డిమాండ్లు పరిష్కారం కోసం ఈ ధర్నా చేస్తున్నామన్నారు.