తన కారు ప్రమాదానికి గురికావడంపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, ఇంటికి చేరుకున్నానని పేర్కొన్నారు. అభిమానులేవరు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. తనపై ప్రేమ ఇంత ప్రేమ చూపిస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కారు స్వల్పంగా ధ్వంసమైందని SMలో పోస్టు పెట్టారు. కాగా, పుట్టపర్తి వెళ్లి వస్తుండగా.. విజయ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.