హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. బొలేరో వాహనం ఢీకొట్టడంతో ధ్వంసమైన తన కారు దిగి స్నేహితుడి కారులో విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.