కాంగ్రెస్ పార్టీ(Congress) తనను 91 సార్లు దూషించిందని ప్రధాని మోదీ(PM Modi) ఆరోపించారు. కర్ణాటక(Karnataka)లో ఎన్నికల(Elections) ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనను దూషించిన ప్రతి పార్టీ కూడా కుప్పకూలిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కార్ణాటక రాష్ట్రం పూర్తి నష్టపోయినట్లు తెలిపారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే బీజేపీ(BJP) పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కర్ణాటక(Karnataka) ప్రజలకు తాను సేవ చేస్తూనే ఉంటానని మోదీ(PM Modi) అన్నారు. కర్ణాటకలో బీదర్ జిల్లాలోని హమ్నాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో అంబేద్కర్, వీర్ సావర్కర్ ను విపక్ష పార్టీ నేతలు అవమానించారని, అటువంటి నాయకులకు ప్రజలే ఓట్లతో బుద్ధి చెబుతారని మోదీ తెలిపారు.
బీజేపీ పార్టీ(BJP)పై ఎంత బురద చల్లినా కూడా కమలం అంతగా వికసిస్తూ ముందుకు సాగుతుందన్నారు. కర్ణాటక(Karnataka)లో జరుగుతున్న ఎన్నికలు కేవలం ఐదేళ్ల ప్రభుత్వం ఏర్పాటు కోసం కాదని, దేశంలోనే కర్ణాటకను అగ్రస్థానంలో నిలబెట్టడం కోసమేనని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. కర్ణాటకలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, కన్నడ రైతులు, ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.