TG: సీఎం రేవంత్ రెడ్డితో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్లో రూ.9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు ఎలి లిల్లీ సంస్థ ముందుకొచ్చింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని సీఎం తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థను రేవంత్ అభినందించారు.