VSP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీల పరిష్కారంలో ఆలస్యం చేసిన అధికారుల తీరుపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా, సక్రమంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ తీరును తప్పుబట్టారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు.