SRPT: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని కాంగ్రెస్ పార్టీ రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షుడు సోమగాని రవి అన్నారు. సోమవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేదలకు న్యాయం చేసిందన్నారు.