NLR: గిట్టుబాటు ధరలు లేకపోవడంతో నిమ్మసాగు తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో 28 వేల ఎకరాలకు పైగా నిమ్మ సాగవుతోంది. పొదలకూరు మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు పైగా వేస్తుండటంతో 2 దశాబ్దాల క్రితం మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. సీజన్లో నిత్యం 20 నుంచి 25 లారీల సరకు వివిధ రాష్ట్రాలకు వెళుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, బీహార్, UP రాష్ట్రాల్లోనూ పంట వేస్తున్నారు.