VZM: కొత్తవలస ఆర్. యూ. బి స్థానికులకు అగ్ని పరీక్షగా తయారైంది. ఆదివారం కురిసిన వర్షానికి ఆర్. యూ.బి వర్షం నీరుతో పూర్తిగా నిండిపోయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామస్తులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవల రైల్వే అధికారులు డ్రైనేజీ కోసం కూడలి పక్కన తవ్వేసి వదిలేయడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కాలువ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.