»Wrestlers Protest Two Firs Filed Against Wfi Chief Brij Bhushan Sharan Singh In New Delhi
Wrestlers Movement ఎట్టకేలకు బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు
అంతర్జాతీయంగా దేశానికి పతకాలు తీసుకొచ్చి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్న రెజ్లర్లు లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ రెజ్లర్లు కొన్ని వారాలుగా రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై భారత రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అతడిపై చర్యలు తీసుకోవాలని దేశ రాజధానిలో భారత దిగ్గజ రెజ్లర్లు (Wrestlers) ఆందోళన (Protest) బాట పట్టారు. వారి ఆందోళనకు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా తో పాటు పెద్ద ఎత్తున రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఆందోళన చేపట్టారు. వారి నిరసనలకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదైంది.
రెజ్లర్లను లైంగికంగా వేధించడంతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ (Connaught Place Police Station)లో రెండు వేర్వేరుగా బ్రిజేష్ పై కేసులు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్లను వేధించిన కేసులో ఒకటి, మరో ఆరుగురు మహిళా రెజ్లర్లు ఈ ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. కేసు నమోదవడంతో రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు డీసీపీ ప్రణవ్ తాయల్ (Pranav Tayal) తెలిపారు.
అంతర్జాతీయంగా దేశానికి (India) పతకాలు (Medals) తీసుకొచ్చి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్న రెజ్లర్లు లైంగిక వేధింపులు (Harrasment), దాడులకు గురవుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ రెజ్లర్లు కొన్ని వారాలుగా రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 23 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు వినోశ్ ఫొగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ తో పాటు దాదాపు 50 మందికి పైగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. వీరికి ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra), సానియా మీర్జా, అభినవ్ బింద్రా, తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao), సినీ నటి ఊర్మిళ, ఇతర క్రీడాకారులు మద్దతు తెలిపారు.