RR: SDNR నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలోని దర్గా వద్ద గందోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA వీర్లపల్లి శంకర్ హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధసమర్పణ కార్యక్రమానికి మైనారిటీ సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మతసామరస్యాన్ని చాటుతూ జరిగిన ఈ వేడుకల్లో భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు.