NDL: బాచిపల్లి గ్రామం నుంచి అహోబిలం పుణ్యక్షేత్రం వరకు 8 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 2.85 కోట్లతో చేపట్టే నిర్మాణానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ఈ రహదారి పూర్తి కావడంతో అహోబిలం వెళ్లే భక్తులకు స్థానికులకు సులభ రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.