ప్రకాశం: ప్రజలు రాత్రివేళల అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ తెలియజేశారు. వెలిగండ్ల మండలం రాళ్లపల్లి, వెదలచెరువు గ్రామాల మధ్య శనివారం రాత్రి పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ ఆదివారం పులి సంచరించిన ప్రాంతాలలో వేలిముద్రలు సేకరించారు. దీంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.