TPT: ఎర్రావారిపాలెం మండలం చెరుకువారిపల్లి పంచాయతీ వంకముద్దివారిపల్లిలో శ్రీచౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ప్రజలు సంతోషంగా ఉండాలని చౌడేశ్వరీ దేవిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.