సత్యసాయి: సినీ హీరో విజయ్ దేవరకొండ పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆశ్రమ ప్రాంగణంలో భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. అనంతరం ఆధ్యాత్మిక వాతావరణంలో బాబా సమాధి వద్ద నివాళి అర్పించారు.