మలుగు జిల్లా కేంద్రంలో ఆదివారం యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా యూత్ కాంగ్రెస్ MLG నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్ హాజరై, మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, అవకాశం ఉన్న చోట బరిలో నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రాంజల్, రాజు, మహేందర్, రమేశ్, రామకృష్ణ ఉన్నారు.