NTR: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2న ముగిసినప్పటికీ, ఆదివారం నాటికి భవానీ భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయమై ఈవో సేన, నూతన ఛైర్మన్ రాధాకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, తగు చర్యలు తీసుకున్నారు.