SKLM: సీఎం సహాయ నిధి పేద ప్రజలకు నిజమైన భరోసా అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో 11 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 11 లక్షల 63 వేలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.