KDP: రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ఉపాధ్యాయుల పాత్రను విశేషంగా ప్రశంసించారు. కాగా, వారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. కాగా, ఎంపికైన ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని స్పష్టం చేశారు.