BDK: జూలూరుపాడులో మండల కౌన్సిల్ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని మాట్లాడారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని వారు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండలంలో ప్రజల పక్షాన సీపీఐ నిలబడి పరిష్కారం కోసం పోరాడుతుందని పేర్కొన్నారు.