SKLM: వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీకి చెందిన మత్స్యకారులకు సబ్సిడీపై వేట సామాగ్రి అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు కొత్తపేట సర్పంచ్ పాపారావు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.