ASF: కాగజ్నగర్ పట్టణం ప్రగతి పథంలో నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో నిధుల కొరత ఉందని, మున్సిపల్ ఆదాయం తక్కువగా, ఖర్చు ఎక్కువగా ఉందన్నారు. పట్టణంలో నిర్వహించాల్సిన పనుల ప్రణాళికలను ప్రభుత్వానికి అందజేశామన్నారు. నిధులు విడుదలైతే ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేస్తామన్నారు.