HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక నాయకులతో చర్చలు జరిపి ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. వారిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీ.ఎన్.రెడ్డి పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ పేర్లను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హై కమాండ్‌కు పంపారు.