ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF)ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ మైదానంలో ఉదయం 9గంటలకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ సెక్రటరీ డీ. విమల తెలిపారు. 14 నుంచి 17ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు అర్హులని, పూర్తి వివరాలకు 97032 69840 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.