తిరుపతి రూరల్ మండల ఎంఈవోగా బీ. పద్మజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఎంఈవోగా విధులు నిర్వహించారు. బదిలీపై తిరుపతి రూరల్ మండలానికి వచ్చారు. ఆమె స్థానంలో ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈవో-1గా పనిచేస్తున్న మహమ్మద్ రఫీ పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బదిలీ అయ్యారు.