TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షం కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.