SRCL: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హెచ్ఎం చెన్నమనేని ఆంజనేయ రావు, ప్రధాన వక్తగా జగిత్యాల జిల్లా సంఘచాలక్ మాననీయ శ్రీ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.