ATP: కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.15,000 విడుదల చేయడంతో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. భాషా సినిమాలో రజనీకాంత్ స్టైల్లో “నేను ఆటో వాడిని” అంటూ ఆటో నడిపి ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు నష్టపోకూండా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.