MNCL: స్థానిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుల విజయం ఖాయం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. రఘునాథ్ అన్నారు. శనివారం లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండల కేంద్రాలలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను, మద్దతుదారులను గెలిపించుకుందామన్నారు.