WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా పండుగ ముగియడంతో మద్యం షాపు టెండర్లపై చర్చలు ఊపందుకున్నాయి. ఒక టెండర్‌కు రూ.3 లక్షలు అవసరమని, ఆరుగురు కలిసి తలో రూ.50 వేలు వేసి టెండర్ వేయాలని కొందరు యోచిస్తున్నారు. విఫలమైతే రూ.50 వేల నష్టం, అదృష్టవశాత్తు గెలిస్తే షాపును అమ్మితే తలా రూ.10 లక్షలకు పైగా వస్తాయని భావిస్తున్నారు.