AP: ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టూరిజం అభివృద్ధిలో ఆటో డ్రైవర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు. అలాగే, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ అన్నా క్యాంటీన్లు పెడుతున్నామని చెప్పారు.