NZB: మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో అటవీ అధికారులు శనివారం అటవీ సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. FRO రాధిక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అడవులను తమ బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. అడవి సస్యశ్యామలంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు.