HYD: పోలీసులు అక్రమ IMF మద్యం విక్రయాల పై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకొని, మొత్తం 57.2 లీటర్ల (318 సీసాల) మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఇతర ప్రాంతాల నుండి మద్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ రూ.60,000గా అంచనా వేశారు.