AKP: ఆటో కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఎలమంచిలి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులో ‘ఆటో కార్మికుల సేవలో’ పథకాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ప్రతి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.