VSP: ACB అధికారులమంటూ కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారని విశాఖ రేంజ్ ఏసీబీ అధికారి బీ.వీ.ఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఏసీబీ అధికారులు ఫోన్లలో డబ్బు అడగరని, అలాంటి మోసపూరిత కాల్స్ ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. బాధితులు వెంటనే పోలీసులకు లేదా ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.