JGL: ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 98వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలను కొనియాడారు.