KDP: జిల్లాలోని ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. జమ్మలమడుగు, బద్వేల్లో ఇద్దరిద్దరు నేతలు సమన్వయకర్తలుగా ఉండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక సందిగ్ధంలో పడుతున్నారు. జమ్మలమడుగులో మాజీ MLA సుధీర్ రెడ్డి, MLC రామసుబ్బారెడ్డిల మధ్య, బద్వేల్లో MLC గోవింద్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డిల మధ్య ఇన్ఛార్జ్ పదవి కోసం పోరు సాగుతుంది.