AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తిరుమల, తిరుపతి అతలాకుతలమయ్యాయి. తిరుపతిలో రహదారులు చెరువులను తలపిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు నీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో ఘాట్ రోడ్లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.