SKLM: వ్యవసాయ పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు గత నెల 30వ తేదీతో ముగిసిందని, అయితే దానిని పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయ శాఖ ఏడి ఎల్ మధు, ఏవో సూర్య కుమారి తెలిపారు. శనివారం వారు మాట్లాడు..తూ నరసన్నపేటలో 6, 690 హెక్టార్లలో నమోదు చేయవలసి ఉందని ఇప్పటివరకు 50% పైగా నమోదు చేశామన్నారు. ఈ క్రాప్ నమోదుకు ఈనెల 25 వరకు గడువు పెంచారన్నారు.