SKLM: జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన GST అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీను కేవలం రెండు స్లాబులకే పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు మరింత మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.