E.G: గోకవరం మండలంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై, పాత నేరస్తులుగా ఉన్న వారిపై రౌడీ షీటర్ ఓపెన్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. దాసరి శ్రీను, మెప్పెల్లి, బుల్లబ్బాయి, గేదెల శివ, కాకర్ల వెంకట కుమార్, పాశం కొండలరావు, పసుపులేటి దేవదాస్, నాయుడు ప్రసాద్, కొండేపూడి సత్యనారాయణపై నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.