SKLM: హిరమండలం మండలం గొట్టా బ్యారేజ్లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 75 వేల క్యూసెక్కులకు ఉన్న వరద నీరు శనివారం ఉదయం 6 గంటలకు 50 వేల క్యూసెక్కులకు చేరుకుందని DE సరస్వతి తెలిపారు. నీటిని నదిలోకి విడిచి పెడుతున్నామని పేర్కొన్నారు. మూడవ, రెండవ ప్రమాద సూచికలు తొలగించామని, ఒకటవ ప్రమాద సూచిక కొనసాగుతుందని ఆమె వివరించారు.