JGL: పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజ ఆనవాళ్లు కలకలం రేపాయి. దసరా సెలవులు ముగిసి, పాఠశాల పునః ప్రారంభమైన వేళ శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది వరండాలో ముగ్గులు వేసి, పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.