నార్వేలో జరుగుతున్న వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 48కిలోల విభాగంలో ఆమె ఈ పతకం సాధించగా.. కొరియాకు చెందిన రి సాంగ్ గమ్ గోల్డ్ సొంతం చేసుకుంది. 2017లో గోల్డ్, 2022లో సిల్వర్ గెలుచుకున్న మీరాబాయికి ఈ ఈవెంట్లో ఇది మూడో మెడల్.