VZM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారిని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కుటుంబసమేతంగా గురువారం రాత్రి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో వేదపండితులు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి జ్ఞాపికను ఎస్పీ దంపతులకు అందజేశారు.