ASF: ఖైదీలు ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్ జిల్లా సబ్ జైల్ లో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ.. గాంధీ అహింసా మార్గంలో ఉద్యమించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని, గాంధీ చూపిన మార్గంలో నడవాలన్నారు.