TG: దసరా సందర్భంగా సొంతూర్లకు వెళ్లిన ప్రజలకు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా RTC చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. RTC ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి బస్ స్టేషన్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.