MBNR: మూసాపేట మండలంలోని వేముల గ్రామంలో ప్రధాన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది ముందుగానే ప్రారంభమైన వర్షాల నేపథ్యంలో రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.